“ఆర్ఆర్ఆర్” లో ఆ హై ఓల్టేజ్ సీక్వెన్స్ సీన్ కోసం 32 రోజుల షూటింగ్!

Published on Jun 5, 2022 7:10 pm IST


రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. థియేటర్ల లో మాత్రమే కాకుండా, డిజిటల్ గా కూడా ఈ చిత్రం కి హై రేంజ్ రీచ్ వస్తోంది. ఈ చిత్రం లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించగా ఇద్దరికీ ఇంటర్నేషనల్ రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రం లో బెస్ట్ సీక్వెన్స్ లలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ ఒకటి. ఈ చిత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి.

పవర్ ఫుల్ పోలీస్ అధికారి గా రామ్ చరణ్ ఇంట్రో సీన్ వెండితెర పై చూస్తుంటే గూస్ బంప్స్ అని చెప్పాలి. ఈ సీక్వెన్స్ సీన్ కోసం 32 రోజుల పాటు షూటింగ్ జరిపినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించడం జరిగింది. అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించగా, శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :