రెండవ షెడ్యూల్ ను మొదలుపెట్టనున్న రామ్ చరణ్ !

3rd, May 2017 - 08:41:38 AM


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి విధితమే. గత నెల 24 న ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తైంది. దీంతో కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న చరణ్ త్వరలొనే రెండవ షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నాడు. ఈ మే నెల 9వ తేదీ నుండి ఈ కొత్త షెడ్యూల్ ఆరంభమవుతుంది తెలుస్తోంది.

పూర్తి గ్రామీణ నైపథ్యంలో నడిచే ప్రేమ కథగా ఉండనున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా చరణ్ పూర్తిగా తన లుక్ మార్చేసి ఒక పల్లెటూరి యువకుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే బయటికొచ్చిన ఆయన లుక్స్ కొన్ని ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇకపొతే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రఫి అందిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.