సమంత పై వస్తున్న రూమర్లకు చెక్ పడింది!


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్లో ఒక చిత్రం చిత్రీకరణలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. రామ్ చరణ్, సమంతలపై ఒక పాటను కూడా చిత్రీకరించారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్ సమంత పాత్రకు మాటలుండవని ఆమె మూగ పాత్ర చేస్తోందని కొన్ని వార్తలోస్తే కాదు చూపులేని అమ్మాయిగా నటిస్తుందని ఇంకొన్ని ఊహాగానాలు పుట్టుకొచ్చాయి.

దీంతో చరణ్ టీమ్ ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చింది. సమంత మూగ పాత్ర గాని, చూపులేని పాత్ర గాని చేయడంలేదని తేల్చింది. ఇకపోతే గ్రామీణ నైపథ్యంలో సాగే ప్రేమ కథగా ఉండనున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పూర్తి భిన్నంగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ఇదే విషయాన్ని చెబుతున్నాయి. మైత్రీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా జగపతిబాబు, ఆది పినిశెట్టిలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.