“చరణ్ 15” ఆల్బమ్ వేరే..!

Published on Feb 2, 2023 12:00 pm IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంపై శంకర్ అన్ని సినిమాల్లానే యూనిట్ పెద్దగా డీటెయిల్స్ అయితే బయటకి ఇవ్వడం లేదు. అయినా కూడా ఈ చిత్రంపై కావాల్సినంత హైప్ ని మాత్రం ఇస్తున్నారు. మరి అలా లేటెస్ట్ గా ఈ సినిమా సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో అయితే ఈ చిత్రం ఆల్బమ్ కోసం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.

తాను ఇప్పుడు చేస్తున్న సినిమాల్లా ఇది కాదని శంకర్ గారి సినిమా అంటే అదే వేరే ఆల్బమ్ అని చెప్పుకొచ్చాడు. దీనితో డెఫినెట్ గా తన వర్క్స్ లో ఈ ఒక్క సినిమా ఆల్బమ్ కి మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పకనే చెప్పాడు. అయితే ఈ ఆల్బమ్ కోసం ఇప్పుడేమి మాట్లాడను అని ఆ ఆడియో కానీ సౌండింగ్ గాని అంతా డిఫరెంట్ గా ఉంటుంది అని తాను తెలిపాడు. దీనితో ఈ సినిమా ఆల్బమ్ పై మాత్రం అంచనాలు మరింత పెరిగాయని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం :