మెగాపవర్ స్టార్ RC 15 షూట్ అప్ డేట్

మెగాపవర్ స్టార్ RC 15 షూట్ అప్ డేట్

Published on Dec 22, 2022 2:11 AM IST


టాలీవుడ్ స్టార్ హీరోల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం భారీ సక్సెస్ లతో అత్యద్భుత క్రేజ్ తో దూసుకెళ్తున్నారు. ఇటీవల తన స్నేహితుడు ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో RC 15 మూవీ చేస్తున్నారు రామ్ చరణ్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ భారీ ప్రతిష్టాత్మక యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ ని హైదరాబాద్ లో డిసెంబర్ ఆఖరి వారంలో యూనిట్ జరుపనుండగా ఈ షెడ్యూల్ లో చరణ్ లేకుండా ఇతర కీలక సీన్స్ ని తీయనున్నారట యూనిట్. అనంతరం జనవరి మొదటివారంలో చరణ్ జాయిన్ అవుతారని, అక్కడి నుండి వేగవంతంగా మిగతా షూటింగ్ కూడా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ మూవీని ప్రేక్షకాభిమానుల ముందుకి తీసుకువచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు