రామ్ చరణ్ శంకర్ మూవీ రెగ్యులర్ షూటింగ్ పై క్లారిటీ!

రామ్ చరణ్ శంకర్ మూవీ రెగ్యులర్ షూటింగ్ పై క్లారిటీ!

Published on Oct 19, 2021 5:21 PM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ మరియు ఆచార్య చిత్రాలను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. తన తదుపరి చిత్రం సౌత్ సెన్సేషన్ శంకర్ దర్శకత్వం లో చేస్తున్న సంగతి తెలిసిందే. Rc15 వర్కింగ్ టైటిల్ పేరిట ఈ చిత్రం షూటింగ్ జరగనుంది. ఈ చిత్రం లో రామ్ చరణ్ సరసన కియర అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ పై ఒక క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ 22 వ తేదిన మొదలు కానున్నట్లు తెలుస్తోంది. కొద్ది వారాల పాటు జరగనున్న ఈ షూటింగ్ పై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు