‘చరణ్ – కియారా’ లవ్ సీన్స్ తో స్టార్ట్ చేశారు !

Published on Nov 15, 2021 4:40 pm IST

మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ – విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా ఇటీవల మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో ఓ ట్రైన్ యాక్షన్ సన్నివేశంతో పాటు కియారాతో ఒక సాంగ్ ను కూడా షూట్ చేశారు. ఇక ఈ రోజు ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో చరణ్ – కియారా పై లవ్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు.

ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో చరణ్ పాత్ర వెరీ పవర్ ఫుల్ గా ఉండనుంది. నిజానికి సహజంగానే తన సినిమాల్లో హీరోల్ని డిఫరెంట్ గెటప్స్ అండ్ మేకప్స్ తో చూపించే ఆనవాయితీ ఉన్న శంకర్, ఈ సినిమాలో కూడా చరణ్ ను అలాగే వినూత్నంగా చూపించబోతున్నాడు. అలాగే బాలీవుడ్ నటి ఇషా గుప్తా కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనుంది.

సంబంధిత సమాచారం :

More