టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ప్రతి శుక్రవారం ఏదో ఒక కొత్త సినిమా రిలీజ్ అవడం కామన్. అయితే, ఈ శుక్రవారం ప్రేమికుల రోజు కూడా వస్తుండటంతో ఆ రోజును మంచి సినిమాతో సెలబ్రేట్ చేసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు. ఇక ఈ శుక్రవారం కూడా బాక్సాఫీస్ దగ్గర కొన్ని సినిమాలు సందడి చేయనున్నాయి. కానీ, అందులో ఎక్కువగా పాత సినిమాలే ఉండటం విశేషం.
ఈ శుక్రవారం(ఫిబ్రవరి 14) రోజున విశ్వక్ సేన్ నటించిన ‘లైలా’, బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతమ్ నటించిన ‘బ్రహ్మా ఆనందం’ రిలీజ్ కానున్నాయి. ఇక అదే రోజున ఏకంగా మూడు పాత సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రాన్ని ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు.
ఇక రామ్ చరణ్ క్లాసిక్ లవ్ స్టోరీ మూవీ ‘ఆరెంజ్’, సూర్య నటించిన మరో ప్రేమకథ చిత్రం ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ కూడా వాలెంటైన్స్ డే వీకెండ్‌లో రీ-రిలీజ్ కానున్నాయి. ఇలా వాలెంటైన్స్ డే వీకెండ్‌లో రెండు కొత్త సినిమాలు రిలీజ్ కానుండగా మూడు పాత సినిమాలు సందడి చేయనున్నాయి.