రియల్ హీరో సోనూ సూద్ థర్డ్ వేవ్ పై కీలక వ్యాఖ్యలు!

Published on Sep 2, 2021 1:30 pm IST


కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత దేశం లో కొనసాగుతూనే ఉంది. ఎంతోమంది పేదలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే స్తోమత లో కూడా లేరు, దేశం లో ఉపాధి అవకాశాలు సైతం సన్నగిల్లాయి. ఈ మేరకు సోనూ సూద్ సోషల్ మీడియా ద్వారా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

తనని ఎవరో థర్డ్ వేవ్ గురించి అడిగిన విషయాన్ని వెల్లడించారు. థర్డ్ వేవ్ వస్తుంది అని మీరు అనుకుంటున్నారా అని సోనూ సూద్ ను ఒక వ్యక్తి అడగగా, సోనూ సూద్ ఇలా అన్నారు. మనం ప్రస్తుతం మూడవ వేవ్ ను ఎక్స్ పీరియన్స్ అవుతున్నాం అని అన్నారు. సామాన్యుడి ను తాకిన పేదరికం, నిరుద్యోగం థర్డ్ వేవ్ కంటే ఎక్కువ కాదు అని వ్యాఖ్యానించారు. దీనికి వాక్సిన్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. ముందుకు రండి, నిరు పేదలకు సహాయం చేయండి, ఉపాధి అవకాశాలు కల్పించండి అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :