‘అల్లు శిరీష్’ అంత అందంగా కనిపించడం వెనుక రహస్యమేమిటో తెలుసా !

26th, July 2016 - 03:18:42 PM

Allu-Sirish
‘అల్లు అరవింద్’ పెద్ద కుమారుడు ‘అల్లు అర్జున్’ హీరోగా పరిచయమై సక్సెస్ అందుకున్న తరువాత ఆయన చిన్న కుమారుడు ‘అల్లు శిరీష్’ కూడా హీరోగా వెండి తెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమా ‘గౌరవంతో’ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయనకు మొదటి ప్రయత్నంలో మాత్రం కాస్త నిరాశే ఎదురైంది. ప్రేక్షకులు ఆయన్ను అంత గొప్పగా రిసీవ్ చేసుకోలేదు. ఆ తరువాత వచ్చిన ‘కొత్తజంట’ పరిస్థితీ అదే. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న శిరీష్ మొత్తం తన లుక్ నే మార్చేసుకున్నారు.

తాజాగా దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో చేసిన ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలో శిరీష్ కాస్త బరువు తగ్గి ట్రిమ్ గా తయారయ్యాడు. రిలీజైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ లో చాలా కొత్తగా, అందంగా కనిపించాడు. దీంతో అందరూ ఆయన మేకోవర్ పట్ల ప్రశంసల వర్షం కురిపించారు. అసలు ఈ మార్పు వెనకున్నది ఎవరంటే శిరీష్ పర్సనల్ స్టైలిస్ట్ ‘ఇంద్రాక్షి పట్టనైక్’. ఈ విషయాన్ని శిరీష్ స్వయంగా తెలియజేశారు. కలకత్తాకు చెందిన ఈమె ఈ మధ్యే టాలీవుడ్ లో స్టైలిస్ట్ గా బాగా పాపులర్ అయింది. రెజినా వంటి స్టార్ హీరోయిన్లకు కూడా స్టైలిష్ గా పనిచేసింది. ఇకపోతే ఈ చిత్రంలో శిరీష్ సరసన లావణ్యా త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా చిత్రం ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.