బాలయ్య, అమితాబ్ ను కలవడానికి అసలు కారణం అదేనా ?
Published on Oct 20, 2016 9:48 am IST

bala-krishna-bigb-m
వర్మ రూపొందిస్తున్న ‘సర్కార్ 3’ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రయేకమైన సెట్లో జరుగుతోంది. అమితాబ్ కూడా ఆ షూటింగ్లో పాల్గొంటున్నారు. నందమూరి బాలకృష్ణ నిన్న వెళ్లి ఆయన్ను కలిసి, కాసేపు మాట్లాడారు. అయితే బాలకృష్ణతో పాటు దర్శకుడు కృష్ణ వంశీ కూడా అమితాబ్ ను కలవడంతో వీరి మీటింగ్ గురించి ఓ కొత్త వార్త హడావుడి చేస్తోంది.

అదేమిటంటే బాలయ్య కృష్ణ వంశీ డైరెక్షన్లో తన 101వ చిత్రం చేయనున్నాడు. దీనికి ఇప్పటికే ‘రైతు’ అనే టైటిల్ ను అనుకున్నారు. ఈ చిత్రం కోసమే వీళ్ళు అమితాబ్ ను కలిశారట. రైతుల సమస్యలకు సంబందించిన కథతో రూపొందనున్న ఈ చిత్రంలో ఓ బలమైన పాత్ర కోసం అమితాబ్ చేస్తే బాగుంటుందని ఆయన్ను సంప్రదించారట. కానీ ఈ వార్త ఎంత వరకూ నిజమో చెప్పలేం కానీ ఇప్పటి వరకూ అయితే మనం’ సినిమాలో నిముషం నిడివి ఉన్న పాత్రలో మినహా అమితాబ్ మరే తెలుగు సినిమాలోనూ నటించలేదు.

 
Like us on Facebook