ఇంత పోటీ మధ్య ‘మహానుభావుడు’ రిలీజవ్వడానికి కారణం !


ఈ ఏడాది శర్వానంద్ పెద్ద హీరోలతో పోటీపడటం ఇది రెండోసారి. మొదటిసారి సీనియర్ స్టార్ హీరోలు చిరు, బాలయ్యలతో పోటీకి దిగిన శర్వా ఈసారి ‘మహానుభావుడు’ చిత్రంతో మహేష్ బాబు ‘స్పైడర్’, ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ లకు పోటీగా బరిలోకి దిగుతున్నాడు. 27న రాబోయే ‘స్పైడర్’ తర్వాత కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే 29వ తేదీ ‘మహానుభావుడు’ రిలీజవుతుండటంతో శర్వానంద్ రిస్క్ చేస్తున్నాడేమోనని అంతా భావించారు.

కానీ ఈ రిలీజ్ వెనుక పక్కా రీజన్ ఉందని దర్సకుడు మారుతి అన్నారు. వచ్చేవి దసరా సెలవులు కానున్న ఈ సీజన్లో ఒక వినోదాత్మక చిత్రం థియేటర్లలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతో రిలీజ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. పైగా టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ బాగుండటంతో పెద్ద సినిమాల మధ్యన కూడా ఈ చిత్రానికి మంచి పాజిటివ్ క్రేజ్ కనిపిస్తోంది. కాబట్టి మారుతి లెక్క తప్పకపోవడానికే ఎక్కువ ఆస్కారముంది.