‘భరత్ అనే నేను’ షూటింగ్ వాయిదాకు కారణం ?
Published on Oct 1, 2017 4:47 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ చిత్రం మొదటిరోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుని న్బడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ చిత్రం విడుదల తర్వాత మహెష్ కొరటాల శివ దర్శకత్వంలో మొదలుపెట్టిన ‘భరత్ అనే నేను’ చిత్రం యొక్క కొత్త షెడ్యూల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ నెల 6 నుండి ఈ షెడ్యూల్ ను రొం లో ప్లాన్ చేశారు. కానీ ఈ షెడ్యూల్ కాస్త వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఐటీ వాయిదా వార్త నిజమేనా, ఒకేవేళ నిజమైతే వాయిదాకు కారణం ఏమిటి అనే వివరాలపై ఇంకా క్లారిటీ రాలేదు. కొందరు ఈ వాయిదాకు కారణం మహేష్ టూర్లో ఉండటమేనని కూడా అంటున్నారు. ప్రస్తుతం మహేష్ కుటుంబంతో కలిసి విదేశీ యాత్రలో ఉన్న వచ్చే వారంలో హైదరాబాద్ కు తిరిగి రానున్నారట. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ సంగీతమందిస్తున్న ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో ఉండనుంది.

 
Like us on Facebook