బిగ్‌బాస్‌ నాన్ స్టాప్: నాగార్జున పంపిన ఫోటోను చూసి కన్నీరు తో ఎమోషనల్ అయిన మిత్రా శర్మ

Published on May 3, 2022 10:00 am IST

బిగ్ బాస్ నాన్ స్టాప్ లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సొంతం చేసుకున్న కంటిస్టెంట్ మిత్రా శర్మ. ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడే నైజం ఉన్న మిత్రా శర్మ హౌజ్ లో టాక్ ఆఫ్ ది టాపిక్ గా మారిపోయారు. తాజాగా నాగార్జున పంపిన ఫోటో చూసిన మిత్రా శర్మ కంటతడి పెట్టుకొని ఎమోషనల్ అయ్యారు.

నామినేషన్ల ప్రక్రియ సమయం లో బిందు మాధవి తనను టార్గెట్ చేస్తూ చేసిన ఆరోపణలను నాగార్జున తప్పుబట్టారు. మిత్రా శర్మ సైతం వాటిని బలంగా తిప్పికొట్టింది. ఎవరైనా ఏదైనా చెబితే ఊహించుకోవద్దూ అంటూ నాగార్జున తెలిపారు. చిన్నతనం లోనే తన తల్లిదండ్రులను పోగొట్టుకున్న మిత్రా శర్మ కి, తన తండ్రి ఫోటో ను పంపారు అక్కినేని నాగార్జున. ఫోటో చూడగానే కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, ఎమోషనల్ అయ్యారు. ఇంట్లోకి అందరి కుటుంబ సభ్యులు వస్తుండటం, తన ఫ్యామిలీ నుండి ఎవరూ రాకపోవడం పై భావోద్వేగం అయ్యారు.

అయితే మిత్రా శర్మ కి ఇస్తమైనసిరి హన్మంతు, గంగాధర్ ను పరిచయం చేయగా, ఎమోషనల్ అవుతూ, పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన తండ్రి తర్వాత తండ్రి లాంటి వారు అని, అన్నయ్య లాంటి వారు అంటూ ఇద్దరినీ చూసి సంతోషం వ్యక్తం చేశారు.

అయితే మిత్రా శర్మ గురించి గంగాధర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. “ఆమె సివంగి. అలానే ఇంటిలో ఆడుతున్నది. బయట ఎలా ఉంటుందో, ఇంటిలో కూడా అలానే ఉంది. షోలో బాగా ఆడుతున్నది” అంటూ చెప్పుకొచ్చారు.

మిత్రా గేమ్ పై సిరి హన్మంతు సైతం ప్రశంసల వర్షం కురిపించడం మాత్రమే కాకుండా, టాప్ 5లో ఉండటం ఖాయం అంటూ చెప్పుకొచ్చారు. ఏదేమైనా మిత్రా శర్మ తన ఆట తీరుతో ప్రేక్షకులని, అభిమానులను అలరిస్తున్న తీరు, హౌజ్ లో ఆడుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది.

సంబంధిత సమాచారం :