‘నక్షత్రం’ ఆలస్యమవడానికి అసలు కారణం ఇదే !
Published on Jul 12, 2017 1:25 pm IST


స్టార్ డైరెక్టర్ కృష్ణ వంశీ చేస్తున్న తాజా చిత్రం ‘నక్షత్రం’ పై సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఒకరకమైన క్యూరియాసిటీ ఉంది. పోలీసులు, వాళ్ళ జీవితాలపై రూపొందిన ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ సినిమా మొదలై సంవత్సరం కావొస్తున్నా ఇంకా పక్కా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు టీమ్. తాజాగా మీడియాతో మాట్లాడిన ఈ చిత్ర హీరో సందీప్ కిషన్ ఈ ఆలస్యం వెనకున్న అసలు కారణాన్ని బయటపెట్టారు.

సుందీప్ కిషన్ మాట్లాడుతూ ‘కృష్ణవంశీగారు సినిమాని గ్రాండ్ స్కేల్ లో తీయాలనుకున్నారు. అలాగే తీశారు కూడా. సినిమా మొదలై సంవత్సరం అయినా ఎక్కడా షూటింగ్ ఆగలేదు. కేవలం షూటింగ్ మాత్రమే 120 రోజులు జరిగింది. 8 భారీ ఫైట్లు, 5 పాటలు ఉన్నాయి. నా పాత్రకే నేను 20 రోజులు డబ్బింగ్ చెప్పాను. అన్నీ అనుకున్నట్టు పూర్తవ్వాలంటే కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. అంతేగాని అనివార్య కారణాల వలన ఆలస్యం కాలేదు. సినిమా పెద్దది కాబట్టి ఇంత టైమ్ పట్టింది’ అన్నారు. సందీప్ కిషన్ తో పాటు ధరమ్ తేజ్ కూడా కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook