‘స్లమ్‌డాగ్’ కష్టాలు.. రిలీజ్ డేట్‌కు ఆ ఒక్కటే అడ్డంకి..!

Slumdog

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్లమ్‌డాగ్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుంది. వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తయినా, రిలీజ్ డేట్ విషయంలో ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం రిలీజ్ డేట్ ప్రకటించే ముందు ఓటీటీ డీల్ కుదుర్చుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. కానీ ప్రస్తుతానికి సరైన ఓటీటీ పార్ట్నర్ దొరకకపోవడంతో సందిగ్ధత నెలకొంది. ఈ డీల్ ఖరారైన వెంటనే అధికారిక విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

‘పూరీ కనెక్ట్స్’ బ్యానర్‌పై పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో టబు, సంయుక్త, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version