అలా చనిపోవాలని ఆశ పడిన కృష్ణంరాజు గారు !

Published on Sep 12, 2022 8:00 am IST

రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి మరణం జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన అభిమానులు. కృష్ణంరాజు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరమని తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రముఖులు. అయితే, ఇప్పుడు కృష్ణంరాజు గారి మరణానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు.. తాను ఎలా చనిపోవాలనుకుంటున్నారో 16 ఏళ్ల క్రితమే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పుడు ఆయన చెప్పిన మాటలు, ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ., కృష్ణంరాజు గారు అప్పుడు ఏం చెప్పారో ఆయన మాటల్లోనే విందాం. ‘‘పచ్చని చెట్టు నీడలో కూర్చొని.. నా జీవితంలో నేను ఎవరికీ అన్యాయం చేయలేదని.. గుండెల మీద చేతులు వేసుకుని.. నిర్మలమైన ఆకాశం వంక చూస్తూ నేను తుదిశ్వాస విడవాలి. ఆ రోజూ, ఈరోజూ.. అదే నా కోరిక’’ అంటూ కృష్ణంరాజు గారు ఎంతో ఫీల్ తో అప్పుడు ఆయన చెప్పారు. ఈ మాటలను బట్టి కృష్ణంరాజు గారి వ్యక్తిత్వం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :