“కేజీఎఫ్ 2” చిత్ర యూనిట్‌కి రెబల్ స్టార్ ప్రభాస్ కంగ్రాట్స్..!

Published on Apr 23, 2022 1:03 am IST

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “కేజీఎఫ్ కి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం “కేజీఎఫ్ చాప్టర్ 2”. ఏప్రిల్ 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకుని భారీగా కలెక్షన్లను రాబట్టుకుంటుంది.

దీంతో ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా కేజీఎఫ్‌ 2 సినిమాపై రెబల్ స్టార్‌ ప్రభాస్ ప్రశంసలు కురిపించాడు. భారీ విజయాన్ని అందుకున్న కేజీఎఫ్‌ 2 చిత్ర బృందానికి కంగ్రాట్స్‌ చెప్తూ సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశాడు.

సంబంధిత సమాచారం :