ప్రభాస్ విషెస్ కు విజయ్ దేవరకొండ రిక్వెస్ట్ !

విజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టాక్సీవాలా’. జి.ఎ 2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌ నిర్మిస్తోన్న చిత్రం ‘టాక్సీవాలా’. ఈ సినిమా నవంబర్‌ 17న విడుదల కాబోతుంది.

కాగా ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండకు మరియు టాక్సీవాలా చిత్రబృందానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విషెస్ తెలిపారు. అలాగే పైరసీని ప్రోత్సహించకుండా థియేటర్‌లోనే టాక్సీవాలా చిత్రాన్ని చూడాలంటూ తన సోషల్ మీడియాలో అకౌంట్ లో పోస్ట్ పెట్టారు.

ప్రభాస్ పోస్ట్ కు ఫుల్ ఖుషీ అయిన విజయ్ దేవరకొండ వెంటనే రిప్లై పెడుతూ.. ‘అన్నా, ఫస్ట్ మాకు సాహో అప్‌డేట్ ఇవ్వండన్నా’ అని ప్రభాస్‌ ను రిక్వెస్ట్ చేశాడు.

Exit mobile version