వాయిదా పడిన ప్రభాస్ “సలార్”?

Published on Sep 1, 2023 8:00 pm IST

పాన్ ఇండియా స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ టైటిల్ రోల్ లో నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా సలార్. లేటెస్ట్ ఇన్ఫో ప్రభాస్ ఫ్యాన్స్ ను కలవరపెడుతుంది. వాస్తవానికి సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా సినిమా థియేటర్లలో రిలీజ్ కావల్సి ఉంది. అయితే ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే, వాయిదాకు సంబంధించి చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

దర్శకుడు ప్రశాంత్ నీల్ కొన్ని కీలకమైన VFX షాట్‌ల క్వాలిటీ కోసం, రీవర్క్ కోసం వాటిని తిరిగి VFX స్టూడియోకి పంపాడు. దీంతో సలార్ విడుదలను డిసెంబర్ వరకు వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 6న విడుదల కావలసి ఉన్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కూడా నిరవధికంగా వాయిదా పడింది. త్వరలోనే ట్రైలర్ మరియు సినిమా విడుదల తేదీలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ మరియు జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించిన సలార్, చిత్రానికి కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :