ఇటీవల బాలీవుడ్ సినిమా దగ్గర సంచలన విజయం నమోదు చేసిన అత్యంత చిన్న చిత్రమే ‘హనుమాన్ అన్శ్’. ఈ చిత్రం సాధించిన విజయం చూసి జాతీయ స్థాయి మీడియా, సినీ ప్రముఖులు సైతం నివ్వెరపోయారు. అంతకంతకూ వసూళ్లు పెంచుకుంటూ వెళుతున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా విడుదల అయ్యేందుకు సిద్ధం అయ్యింది.
ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెలుగులో తన బ్యానర్ ద్వారా విడుదల చేయనున్నట్టుగా టాక్ ఉంది. ఫైనల్ గా దీనిని నిజం చేస్తూ తమ బ్యానర్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నుంచి అధికారిక ప్రకటన ఇప్పుడు వచ్చేసింది. ఈ చిత్రాన్ని వారు ఈ సెప్టెంబర్ 18న తెలుగులో విడుదల చేస్తున్నట్టుగా ఖరారు చేశారు.
సో ఈ సినిమాకి తెలుగు ఆడియెన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి. గతంలో ఛావా, ధురంధర్ చిత్రాలకి మంచి స్పందనను తెలుగు ఆడియెన్స్ అందించారు. ఇక ఈ డివోషనల్ సినిమాకి ఏం చేస్తారో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించగా శోబినా సత్య ప్రధాన పాత్రలో నటించారు.
A divine tale. A powerful journey. A story that shook the entire nation. 🚩🙏🏻#HanumanAnsh is now coming to Telugu! 🙌🏻
Presented by #TrivikramSrinivas
Telugu Theatrical Release by @Fortune4CinemasGrand Release in Telugu on September 18th! 🔥#ShobhinawSatyaa #VihaanShedge pic.twitter.com/LPVVf0g1c1
— Fortune Four Cinemas (@Fortune4Cinemas) September 11, 2026
