ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చిన రీసెంట్ హిట్ “గరుడన్”

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చిన రీసెంట్ హిట్ “గరుడన్”

Published on Jul 3, 2024 8:06 AM IST


ఈ ఏడాదిలో కోలీవుడ్ సినిమా నుంచి వచ్చిన కొన్ని చిత్రాలు మంచి హిట్స్ గా నిలిచాయి. అయితే ఈ హిట్ చిత్రాల్లో ప్రముఖ కమెడియన్ టర్న్డ్ హీరో సూరి నటించిన చిత్రం “గరుడన్” కూడా ఒకటి. మరి తాను ప్రధాన పాత్రలో నటించిన మొదటి చిత్రం “విడుదల” హిట్ తర్వాత వచ్చిన ఈ సినిమా కూడా తమిళ నాట సాలిడ్ టాక్ ని సొంతం చేసుకొని హిట్ అయ్యింది.

ఇక ఈ చిత్రాన్ని ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ తెరకెక్కించగా విడుదల దర్శకుడు వెట్రిమారన్ ఈ చిత్రానికి కథ అందించారు. మరి తన కథతో వచ్చిన ఈ సినిమా తమిళ్ లో మంచి హిట్ గా నిలిచి ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా ఈరోజు నుంచి ఈ చిత్రం తమిళ్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది.

అలాగే తెలుగులో అతి త్వరలోనే వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా వినిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో మళయాళ టాలెంటెడ్ నటుడు ఉన్ని ముకుందన్ కూడా ముఖ్య పాత్రలో నటించగా సముద్రఖని తదితర వెర్సటైల్ నటులు కూడా నటించారు. అలాగే యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా లార్క్ స్టూడియో గ్రాస్ రూట్ ఫిల్మ్ స్టూడియో వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు