హిందీలో OTT అరంగేట్రం చేసిన రీసెంట్ హారర్ థ్రిల్లర్

Published on Sep 27, 2023 4:40 pm IST

అశ్విన్ కాకుమాను మరియు పవిత్రా మరిముత్తు ప్రధాన పాత్రల్లో నటించిన పిజ్జా 3 ఆగష్టు 18, 2023న థియేటర్ల లో గ్రాండ్ గా విడుదలైంది. ఈ చిత్రం ఇప్పటికే పలు బాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో OTT అరంగేట్రం చేసింది. తాజా సమాచారం ఏమిటంటే, సినిమా హిందీ వెర్షన్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నార్త్‌ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఈ చిత్రంలో గౌరవ్ నారాయణన్, అభిషేక్ శంకర్, కాళీ వెంకట్, అనుపమ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అశ్విన్ హేమంత్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని తిరుకుమారన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సివి కుమార్ నిర్మించారు.

సంబంధిత సమాచారం :