డీసెంట్ టీఆర్పీ రేటింగ్ రాబట్టిన మాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్!

Published on Sep 22, 2023 9:00 pm IST

2018 మలయాళ చిత్ర పరిశ్రమ యొక్క కొత్త ఇండస్ట్రీ హిట్. 2018 సంవత్సరంలో వచ్చిన కేరళ వరదల ఆధారంగా చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రం మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఎమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్దిక్, జాయ్ మాథ్యూ, సుధీష్ కీలక పాత్రలు పోషించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని బన్నీ వాస్ విడుదల చేశారు. ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ కూడా థియేటర్లలో బాగా ఆడింది. దాదాపు 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇటీవల, తెలుగు వెర్షన్ స్టార్ మా ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. తాజా అప్డేట్ ఏమిటంటే, 2018 మొదటి టెలికాస్ట్‌లో డీసెంట్ టీఆర్పీ రేటింగ్ రాబట్టడం జరిగింది. 3.29 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఈ చిత్రం ప్రస్తుతం సోనీ LIV ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం అవుతోంది.

సంబంధిత సమాచారం :