రికార్డు ధరకు కమల్ సాలిడ్ సినిమా ఓటిటి, శాటిలైట్ హక్కులు.!

Published on Mar 2, 2022 8:00 am IST

విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా కోలీవుడ్ కి చెందిన యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “విక్రమ్” లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో కమల్ తో పాటుగా మరో ఇద్దరు విలక్షణ నటులు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరియు మళయాళ టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాజిల్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరి ఈ ముగ్గురు ఒకే స్క్రీన్ పై అనే మాటే ఈ సినిమాపై భారీ స్థాయి అంచనాలు నెలకొల్పింది. అందుకే మంచి క్రేజ్ ఏర్పడ్డ ఈ చిత్రానికి భారీ డిమాండ్ ఇప్పుడు నెలకొన్నట్టు టాక్. అందులో భాగంగానే ఈ చిత్రం తాలూకా ఓటిటి మరియు శాటిలైట్ హక్కులకు రికార్డు ధర పలికిందట. కేవలం రెండు హక్కులు కలుపుకొని విక్రమ్ ఏకంగా 112 కోట్లకి అమ్ముడుపోయాయట. అంటే ఈ సినిమా పై ఏ స్థాయి క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :