మన దగ్గర “కేజీయఫ్ 2” రికార్డు స్థాయి బిజినెస్ స్టార్ట్.!

Published on Mar 29, 2022 5:55 pm IST


నెక్స్ట్ మళ్ళీ పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు నెలకొల్పుకొని విడుదలకి సిద్ధంగా ఉన్న మరో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “కేజీయఫ్ చాప్టర్ 2”. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మరికొన్ని రోజుల్లో రిలీజ్ కి రెడీగా ఉంది.

మరి లేటెస్ట్ గా అయితే వచ్చిన ట్రైలర్ ఆల్ టైం ఇండియన్ రికార్డు సెట్ చెయ్యగా ఇదే విధంగా బాక్సాఫీస్ దగ్గర కూడా అదరగొడుతుంది అని అంతా అనుకుంటున్నారు. మరి ఇప్పుడు మరింత స్థాయిలో అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రంకి మన తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ బిజినెస్ జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది.

గతంలో చాప్టర్ 1 కి అయ్యిన బిజినెస్ కన్నా డబుల్ ట్రిపుల్ మార్జిన్ లో జరుగుతున్నట్టు టాక్. ట్రైలర్ కి అయితే కన్నడ కన్నా మన తెలుగులోనే అధిక రెస్పాన్స్ ని ఇచ్చారు మన వాళ్ళు. మరి సినిమా రిలీజ్ అయ్యాక వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. అది తెలియాలి అంటే ఈ వచ్చే ఏప్రిల్ 14 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :