“కేజీయఫ్ 2” కి ఇండియాలో భారీ లెవెల్లో స్క్రీన్లు?

Published on Mar 24, 2022 5:24 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా ఉన్న ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని పాన్ ఇండియా వీక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ మరియు ట్రైలర్ కి ఇప్పుడు సమయం దగ్గర పడుతుండడంతో మరిన్ని అంచనాలు ఈ సినిమాపై నెలకొంటున్నాయి.

అయితే లేటెస్ట్ గా ఓ బజ్ అయితే ఈ సినిమాపై వైరల్ అవుతుంది. ఈ సినిమా ఏకంగా ఒక్క ఇండియాలోనే 6 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అవుతున్నట్టుగా టాక్. అన్ని భాషల్లో కూడా ఈ సినిమాపై మంచి క్రేజ్ ఉంది. మరి ఇందులో ఎంతమేర నిజముందో వేచి చూడాలి. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ అధీరా అనే పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించారు. అలాగే ఈ ఏప్రిల్ 14న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

సంబంధిత సమాచారం :