“పుష్ప 2” కి అక్కడ రికార్డ్ ఆఫర్స్ వస్తున్నాయట.!

Published on May 25, 2022 3:40 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ సినిమా “పుష్ప”. మొత్తం రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ 1 ఆల్రెడీ రిలీజ్ అయ్యి పాన్ ఇండియా లెవెల్లో రీసౌండింగ్ హిట్ అయ్యింది. అయితే ఇక ఈ రెండో సినిమా రిలీజ్ కాదు ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వకపోయినా రికార్డు ఆఫర్స్ వస్తున్నాయట.

ఆల్రెడీ మన ఇండియాలో థియేట్రికల్ ఓటీటీ హక్కులు భారీ ధర పలుకగా ఇప్పుడు ఓవర్సీస్ హక్కులపై లేటెస్ట్ టాక్ బయటకి వచ్చింది. దీని ప్రకారం అయితే ఈ సినిమాకి ఓవర్సీస్ లో ఏకంగా పలు మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలకు దగ్గరగా ఆఫర్స్ వస్తున్నాయట. మొత్తానికి అయితే పుష్ప ది రూల్ పై మాత్రం హైప్ ఇంకో లెవెల్లో ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :