రికార్డ్ ధరకు అమ్ముడైన ‘అజ్ఞాతవాసి’ నైజాం రైట్స్ !

సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలాంటిదిక త్రివిక్రమ్ డైరెక్షన్లో అంటే వేరే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ క్రేజీ కాంబినేషన్ వలన ప్రకటన రోజే చిత్రం దాదాపు హిట్ అనే పాటివ్ ఒపీనియన్ అందరిలోనూ మొదలైపోతుంది. అందుకే వీరిద్దరూ కలిసి చేసిన ‘అజ్ఞాతవాసి’ చిత్రానికి డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

దాని మూలంగానే సినిమా నైజాం హక్కులు కళ్ళు చెదిరే స్థాయిలో రూ. 27 కోట్లకు అమ్ముడయ్యాయి. ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక మొత్తం పలికిన చిత్రం ఇదే కావడం విశేషం. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మించిన ఈ చిత్రం జనవరి 10న రిలీజ్ కానుంది. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కుష్బు, రావు రమేష్, ఆది పినిశెట్టి, మురళి శర్మలు పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.