అల్లు అర్జున్ క్రేజ్ ఏపాటిదో అర్థమైపోతోంది !

26th, February 2017 - 10:08:42 AM


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’ రికార్డుల మోత మోగిస్తోంది. చిత్ర ఆరంభం నుండే అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఈ చిత్రం పట్ల అభిమానులు, సినీ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. అంతేగాక శివరాత్రి సందర్బంగా రిలీజైన టీజర్ సైతం కేవలం రెండు రోజుల్లో 3. 6 మిలియన్ వ్యూస్ ను సాధించి బన్నీ క్రేజ్ ఏపాటిదో చాటింది. తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ కూడా రికార్డ్ ధరకు అమ్ముడైనట్టు తెలుస్తోంది.

ప్రముఖ టీవీ ఛానెల్ ఒకటి ఈ చిత్ర హక్కుల కోసం ఏకంగా రూ.18 కోట్లు వెచ్చించిందట. తెలుగు రాష్ట్రాల్లోనే గాక, ఇతర రాష్ట్రాల్లో బన్నీకున్న బలమైన ఫ్యాన్ బేస్, సినిమాపై ఉన్న అంచనాల కారణంగా ఈ హక్కులు ఇంత భారీ ధర పలికాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని ఫుల్ లెంగ్త్ కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చి దిద్దుతున్నారు.