మహేష్ బాబు సినిమా అంత రేటు పలికిందా ?
Published on Oct 25, 2016 8:30 pm IST

mahesh-babu
సౌత్ ఇండియా సార్ హీరో మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాపై ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం యొక్క బిజినెస్ తారా స్థాయిలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా సినీ వర్గాల నుడి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యే ఛాన్స్ ఉందట.

ఓ ప్రముఖ టీవీ ఛానెల్ ఈ చిత్రం యొక్క శాటిలైట్, ఆడియో ఈవెంట్ హక్కుల కోసం సుమారు రూ. 18. 5 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించేందుకు సిద్ధంగా ఉందని, ఇంకా మంతనాలు జరుగుతున్నాయని వినికిడి. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వేరే షెడ్యూల్ కోసం త్వరలోనే అహ్మదాబాద్ వెళ్లనుంది. ఇకపోతే మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ఈ దీపావళికి విడుదలవుతుందో లేదో ఇంకా ఖచ్చితంగా తెలియరాలేదు.

 
Like us on Facebook