టాక్..షారుఖ్ “జవాన్” కి రికార్డ్ నాన్ థియేట్రికల్ బిజినెస్.?

Published on Sep 25, 2022 10:03 am IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ లైనప్ పై ఇప్పుడు అక్కడి సినీ వర్గాల్లో చాలా అంచనాలు నెలకొన్నాయి. తన గత సినిమాల ఫలితాలు ఏమో కానీ ఇప్పుడు షారుఖ్ చేస్తున్న ప్రతి సినిమాపై కూడా ఒక దాన్ని మించి ఒకటి భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా తాను చేస్తున్నటువంటి లేటెస్ట్ చిత్రాల్లో కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అట్లీ తో చేస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “జవాన్” కూడా ఒకటి.

మరి ఈ సినిమాని కూడా పాన్ ఇండియా లెవెల్లోనే ప్లాన్ చెయ్యగా దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి జస్ట్ నాన్ థియేట్రికల్ హక్కులే షాకింగ్ ఫిగర్ పలికాయట. మరి ఈ చిత్రం ఓటిటి హక్కులు నెట్ ఫ్లిక్స్ అలాగే శాటిలైట్ హక్కులు జీ సంస్థలు సొంతం చేసుకోగా మరి రెండిటికి గాను 250 కోట్ల మాసివ్ బిజినెస్ జరిగిందట. ఇది మాత్రం ఊహించని నెంబర్ అనే చెప్పాలి. ఇంకా దీనిపై అయితే మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :