రికార్డ్ స్థాయిలో రిలీజ్ కానున్న ‘భాగమతి’ !

లేడీ సూపర్ స్టార్ అనుష్క నటించిన తాజా చిత్రం ‘భాగమతి’ ఈ న్ల 26న రిలీజ్ కానుంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. గతంలో స్వీటీ చేసిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘అరుంథతి’ విశేషంగా అలరించడంతో ఈ చిత్రం నుండి కూడా ఆ స్థాయి ఔట్ ఫుట్ ను ఆశిస్తున్నారు ప్రేక్షకులు. ఈ అంచనాలను దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.

ముఖ్యంగా ఓవర్సీస్లో అయితే ఇప్పటి వరకు దక్షిణాదికి చెందిన ఏ లేడీ ఓరియెంటెడ్ మూవీ విడుదలకాని స్థాయిలో ఈ చిత్రం రిలీజవుతోంది. తెలుగు, తమిళ వెర్షన్లు రెండూ కలిపి 125 లొకేషన్లలో రిలీజవుతున్నాయి. జి.అశోక్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించగా థమన్ సంగీతాన్ని అందించారు.