“బీస్ట్” రెండో సాంగ్ కి కూడా రికార్డు రెస్పాన్స్.!

Published on Mar 20, 2022 11:11 am IST


ఇళయ థలపతి జోసెఫ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా “బీస్ట్” కోసం అందరికీ తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ చాలా త్వరగానే ఫినిష్ చేసేసారు. మరి విజయ్ అంటేనే భారీ రికార్డుల మోత ఉంటుంది.

అలానే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సెన్సేషనల్ రెస్పాన్స్ తో భారీ హిట్ కాగా ఇండియా లోనే టాప్ మోస్ట్ లైక్స్ సాధించిన వీడియోగా భారీ రికార్డు నమోదు చేసింది. మరి ఇప్పుడు నిన్న ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ని రిలీజ్ చెయ్యగా దీనికి కూడా రికార్డు రెస్పాన్స్ వస్తుంది.

10 గంటల్లోనే 10 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడమే కాకుండా 10 లక్షల లైక్స్ ని కూడా కొల్లగొట్టి చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం కంపోజ్ చెయ్యగా ఈ రెండు పాటలకి కూడా జానీ మాస్టర్ నే కొరియోగ్రాఫ్ చేశారు. అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :