పవన్ కళ్యాణ్ సినిమా డీల్ అదిరింది..!


పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. ఇటీవల ఈ చిత్రానికి అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందంటూ వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేసేలా తాజా ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ రికార్డు అమౌంట్ కు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.

ప్రముఖ ఛానల్ జెమినీ టివి తెలుగు వర్షన్ శాటిలైట్ హక్కులను భారీస్థాయిలో రూ 21 కోట్లకు సొంతం చేసుకుంది. తెలుగు శాటిలైట్ రైట్స్ విషయంలో ఇది నాన్ బాహుబలి రికార్డ్. బాబుబలి రెండు భాగాలను మాటివి దాదాపు 30 కోట్లకు సొంతం చేసుకుంది. కాగా పవన్, త్రివిక్రమ్ ల చిత్ర హిందీ శాటిలైట్ హక్కులు కూడా భారీ మొతానికి అమ్ముడయ్యాయి. హిందీ హక్కులు రూ 11 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. కాగా పవన్ – త్రివిక్రమ్ ల చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.