‘రాధేశ్యామ్’కి సంబంధించి మరో ఇంపార్టెంట్ అప్డేట్..!

Published on Feb 4, 2022 1:00 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కరోనా కారణంగా పలుమార్లు రిలీజ్ వాయిదాపడుతూ వచ్చిన ఈ పాన్ ఇండియన్ చిత్రాన్ని మార్చి 11వ తేదిన విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు.

ఇకపోతే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఏమిటంటే తమిళనాట ‘రాధేశ్యామ్’ మూవీతో ఉదయనిథి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయంట్ మూవీస్ సంస్థ కొలాబరేట్ అయ్యింది. తమిళ వెర్షన్‌కు ఈ సంస్థ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇదిలా ఉంటే జస్టిన్ ప్రభాకర్ స్వరాలు సమకూర్చిన ‘రాధేశ్యామ్’ చిత్రానికి తమన్ నేపథ్య సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :