తమిళ యువ హీరో సినిమాలో రెజీనా!

6th, February 2017 - 11:04:03 AM


తెలుగులో వరుస సినిమాలతో మెప్పించి స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతోన్న వారిలో రెజీనా ఒకరు. ఇక తాజాగా ఆమె తన ఫోకస్‌ను తమిళ సినిమా వైపుకు మళ్ళించి అక్కడ వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్నారు. ఇప్పటికే రెజీనా నటిస్తోన్న పలు తమిళ సినిమాలు సెట్స్‌పై ఉండగా, తాజాగా విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటించనున్నారు.

తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే దిశగా అడుగులేస్తోన్న విష్ణు విశాల్, ఈ సినిమాను తన సొంత బ్యానర్ వీవీ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్నారు. చెల్లా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతానికి ఎక్కువగా తమిళ సినిమాలే చేస్తోన్న రెజీనా నటించిన ‘నక్షత్రం’ అనే తెలుగు సినిమా ఒకటి విడుదలకు సిద్ధమవుతోంది.