‘జమునా రాణి’గా మారిపోయిన రెజీనా..!
Published on Oct 16, 2016 5:47 pm IST

regina
తెలుగులో గత కొద్దికాలంగా వరుస సినిమాలతో మెప్పిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతోన్న వారిలో రెజీనా ఒకరు. తాజాగా ఆమె క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘నక్షత్రం’ అనే పోలీస్ థ్రిల్లర్‍లో ఓ డిఫరెంట్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలో రెజీనా ‘జమునా రాణి’ అనే జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో కనిపించనున్నారట. ఇక రెజీనాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కూడా ఈ ఉదయం విడుదల చేయగా, ఆ ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న నక్షత్రం పూర్తిగా కృష్ణవంశీ స్టైల్ పోలీస్ థ్రిల్లర్‍గా ప్రచారం పొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్స్ అన్నీ సినిమాపై మంచి అంచనాలను రేకెత్తిస్తున్నాయి. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం ఇప్పట్నుంచే టీమ్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది.

 
Like us on Facebook