మహేష్ సినిమాలో అలనాటి గ్లామర్ క్వీన్ ?

Published on Mar 1, 2023 12:26 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఐతే, ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ సీనియర్ భామ రేఖ ను తీసుకోవాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నారట. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఈ పాత్రకి అలనాటి గ్లామర్ క్వీన్ రేఖ అయితేనే సరైన న్యాయం జరుగుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. మరి రేఖ ఒప్పుకుంటే.. ఈ సినిమా పై బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అవుతాయి.

మొత్తానికి త్రివిక్రమ్ ఈ చిత్రానికి నటీనటులను ఎంపిక చేస్తున్న విధానం చాలా ఆసక్తికరంగా ఉంది. పైగా పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబుతో పూజా హెగ్డే రొమాన్స్ చేయనుంది.

సంబంధిత సమాచారం :