ఎం ఎస్ రాజు “7 డేస్ 6 నైట్స్” కి రిలీజ్ డేట్ కన్ఫర్మ్.!

Published on Jan 2, 2022 3:00 pm IST

మన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎం ఎస్ రాజు కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిర్మాతగా అనేక హిట్ సినిమాలు తీసిన ఈ సీనియర్ ఫిల్మ్ మేకర్ గత లాక్ డౌన్ లోనే దర్శకునిగా మారి టాలీవుడ్ ఆడియెన్స్ ని తన దర్శకత్వంతో మెప్పించారు. “డర్టీ హరి” అనే ఒక కొత్తతరం సినిమాని అందులోని నేటితరం యువతకి, ఆడియెన్స్ కి నచ్చే విధంగా తెరకెక్కించి అనేక ప్రశంసలు తెలిపారు.

మరి మళ్ళీ తన దర్శకత్వంలోనే స్టార్ట్ చేసిన మరో ఆసక్తికర చిత్రం “7 డేస్ 6 నైట్స్”. దానికి పూర్తి డిఫరెంట్ గా ప్లాన్ చేసిన ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ కి రెడీ చేశారు. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారట. జనవరి 14న ఈ సినిమాకి డేట్ ని వారు ఫిక్స్ చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ హీరోగా నటించగా ఈ చిత్రానికి కేవలం 16 ఏళ్ల యువ సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి మంచి ట్యూన్స్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు.

సంబంధిత సమాచారం :