లేటెస్ట్..నిఖిల్ “18 పేజెస్” కి రిలీజ్ డేట్ కన్ఫర్మ్.!

Published on Nov 14, 2021 12:00 pm IST

టాలీవుడ్ లో పలు ఆసక్తికర వినూత్న సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. తన నుంచి ఓ సినిమా వస్తుంది అంటే మంచి థ్రిల్లర్ గా ఉంటుందని ఒక మార్క్ ను తనకు సెట్ చేసుకున్నాడు. అలానే ఇప్పుడు పలు ఆసక్తికర సినిమాలను కూడా చేస్తూ వస్తున్నాడు. మరి ఈ చిత్రాల్లో క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కథతో పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ సినిమానే “18 పేజెస్”.

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని మేకర్స్ రిలీజ్ కి సిద్ధం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ఈ సినిమాని థియేట్రికల్ రిలీజ్ కి తీసుకువస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేసారు. మరి ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ బ్యానర్ గీతా ఆర్ట్స్ 2 పై బన్నీ వాస్ నిర్మాణం వహించారు. ఇక్కడే ఆల్రెడీ సినిమా సగం హిట్టని అర్ధం చేసుకోవచ్చు. మరి కంప్లీట్ గా సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే అప్పుడు వరకు ఆగక తప్పదు. ఈ సినిమాకి హిట్ సంగీత దర్శకుడు గోపి సుందర్ మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం :