ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ వెబ్ సిరీస్ “సుజల్” రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Jun 3, 2022 7:00 pm IST

కోలీవుడ్ మూవీ విక్రమ్ వేదతో సుపరిచితుడైన దర్శక ద్వయం పుష్కర్ – గాయత్రి, సుజల్ ది వోర్టెక్స్ అనే వెబ్ సిరీస్‌ కి రచన మరియు రూపొందించడం జరిగింది. బ్రమ్మ మరియు అనుచరణ్ ఎం దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలో నటించింది. OTT దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ బహుభాషా వెబ్ సిరీస్‌ను ప్రకటించడానికి మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది.

వీడియో గ్లింప్స్ లో సిరీస్ లోని ప్రధాన తారాగణాన్ని చూపించడం జరిగింది. రాధాకృష్ణన్ పార్థిబన్, శ్రీయా రెడ్డి మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ని పుష్కర్ గాయత్రి కూడా నిర్మించారు. సుజల్ వోర్టెక్స్ సీజన్ 1 OTT ప్లాట్‌ఫారమ్‌లో జూన్ 17, 2022 న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :