‘అల్లరి’ నరేష్ “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” రిలీజ్ డేట్ ఖరారు.!

Published on Sep 29, 2022 10:00 am IST

టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ హీరోగా ఇప్పుడు పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు ఎంచుకుంటూ వస్తున్నాడు. నటన పరంగా చాలా మంచి స్కోప్ ఉన్న పాత్రలు కథాబలం ఉన్న సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అలా రీసెంట్ గా “నాంది” సినిమాతో ఇంటెన్స్ హిట్ కొట్టిన తాను నెక్స్ట్ సినిమాగా దర్శకుడు ఏ ఆర్ మోహన్ తో చేసిన సినిమా “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం”.

మరి ఆల్రెడీ వచ్చిన పోస్టర్ సహా టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు అయితే మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఈ నవంబర్ 11న రిలీజ్ చేస్తున్నట్టు నరేష్ పై మంచి పోస్టర్ తో అనౌన్స్ చేశారు. ఇక ఈ చిత్రంలో ఆనంది ఫీమేల్ లీడ్ లో నటించగా వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకల సంగీతం అందించగా హాస్య మూవీస్ మరియు జీ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :