అవైటెడ్ “కాంతారా” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.!

అవైటెడ్ “కాంతారా” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Nov 17, 2022 4:54 PM IST

కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి హీరోగా తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “కాంతారా”. పాన్ ఇండియా లెవెల్లో భాషతో సంబందం లేకుండా ఓ డివైన్ సెన్సేషనల్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. ఇక ఇప్పటికీ కూడా థియేటర్స్ లో మంచి రన్ ని కొనసాగిస్తున్న ఈ చిత్రం ఓటిటి రిలీజ్ ఎప్పుడు అనేది కూడా గత కొంత కాలం నుంచి మంచి ఆసక్తిగా మారింది. మరి ఇపుడు ఈ అవైటెడ్ టైం కి తెర పడినట్టుగా తెలుస్తుంది.

మరి ఈ చిత్రాన్ని అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ ప్రైమ్ వీడియో వారు ఈ నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ కి అందుబాటుకుకి తీసుకురానున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇది హిందీ మినహా భాషల్లోనా లేక అన్ని భాషల్లో కలిపి ఒకేసారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. అలాగే ఆజానీస్ లోకనాథ్ సాలిడ్ మ్యూజిక్ ఆల్బమ్ అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు