లేటెస్ట్..”గుడ్ లక్ సఖి” కి రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Jan 21, 2022 4:00 pm IST

గత కొంత కాలంగా టాలీవుడ్ లో ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ అయ్యిపోయి రిలీజ్ కి రెడీ అయ్యిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఒక్కొక్కటిగా ఇప్పుడు రిలీజ్ అవుతూ వస్తున్నాయి కూడా. మరి అలాంటి చిత్రాల్లో ఒకటైన మరో చిత్రం ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయ్యింది. అదే “గుడ్ లక్ సఖి”.

స్టార్ హీరోయిన్ కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలో రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తీసిన ఈ చిత్రం ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ డేట్ ని తెచ్చుకుంది. మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే జనవరి 28 న థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.

మధ్యలో కొన్ని ఓటిటి ఆఫర్స్ వచ్చినా లాస్ట్ కి మాత్రం మేకర్స్ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు ఆదిపినిశెట్టి తదితరులు కీలక పాత్రల్లో నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :