శౌర్య “వరుడు కావలెను” కి రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Sep 25, 2021 1:00 pm IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య చేస్తున్న లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో రీతూ వర్మ హీరోయిన్ గా లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “వరుడు కావలెను” కూడా ఒకటి. రీసెంట్ గా వచ్చిన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకోవడంతో ఈ సినిమాపై మరింత బజ్ నెలకొంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు తన రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేస్తుంది.

రానున్న అక్టోబర్ నెల దసరా కానుకగా అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి కన్ఫర్మ్ చేశారు. సో దసరా రేస్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఈ చిత్రం మంచి ట్రీట్ ఇవ్వొచ్చు. ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందివ్వగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :