పునీత్ చివరి సినిమా “జేమ్స్” డిజిటల్ రిలీజ్ కి డేట్ ఫిక్స్.!

Published on Mar 31, 2022 11:00 am IST

దివంగత హీరో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన చివరి సినిమా “జేమ్స్”. దర్శకుడు చేతన్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పునీత్ కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా గా మాత్రమే కాకుండా పునీత్ అభిమానులకి ఒక మరపు రాని సినిమాగా అందించారు. అలాగే కన్నడ లో రికార్డు ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రంగా ఇది నిలిచింది.

మరి థియేటర్స్ లో రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఫైనల్ గా ఓటిటి లో వచ్చేందుకు సిద్ధం అయ్యింది. ఈ ఏప్రిల్ 14 నుంచి ప్రముఖ ఓటిటి యాప్ ‘సోనీ లివ్’ లో ప్రసారం చేస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఒక్క కన్నడ భాషలోనే కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ అలాగే మళయాళం మరియు హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నట్టు ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. మరి అప్పుడు మిస్ అయ్యిన వారు మరికొన్ని రోజుల్లో అయితే పునీత్ చివరి సినిమాని వీక్షించవచ్చు.

సంబంధిత సమాచారం :