రాజ్ తరుణ్ హిలేరియస్ ఎంటర్టైనర్ కి రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Oct 31, 2021 2:40 pm IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా ఇప్పుడు మంచి లైనప్ తో మళ్ళీ ట్రాక్ లో పడేందుకు రెడీ అవుతున్నాడు. అలా తన లైనప్ లో ఉన్న చిత్రాల్లో దర్శకుడు శ్రీను గవిరెడ్డి తెరకెక్కిచిన లేటెస్ట్ హిలేరియస్ ఎంటర్టైనర్ “అనుభవించు రాజా” కూడా ఒకటి. చాలా కాలం తర్వాత టాలీవుడ్ నుంచి ఒక కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అందులోని మంచి ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ తో ప్రామిసింగ్ గా అనిపించింది.

ఇక ఇప్పుడు ఈ సినిమా కూడా ఎట్టకేలకు రిలీజ్ డేట్ ని తెచ్చేసుకుంది. ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే నవంబర్ 26 న రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సినిమాతో రాజ్ తరుణ్ మళ్ళీ ట్రాక్ లో పడతాడేమో చూడాలి. మరి ఈ చిత్రంలో కాశీష్ ఖాన్ హీరోయిన్ గా నటించగా గోపి సుందర్ సంగీతం అందించాడు. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ మరియు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :