రామ్ మాస్ ప్రాజెక్ట్ “ది వారియర్” కి రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Mar 27, 2022 12:55 pm IST

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ చిత్రం “ది వారియర్”. మాస్ లో తనకి మంచి క్రేజ్ నమోదు అవ్వడంతో తాను కూడా మంచి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లని లైన్ లో పెట్టుకుంటూ వెళ్తున్నాడు. అలా మాస్ సినిమాలలో తనకంటూ మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు ఎన్ లింగసామితో ఈ సినిమా అనౌన్స్ చెయ్యడంతోనే మంచి హైప్ ని తెచ్చుకున్నాడు.

మరి పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పుడు క్రేజీ అప్డేట్ ని అందించారు. ఈ చిత్రానికి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ ఈ జూలై 14న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ చిత్రాల్లో రామ్ ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటిస్తుండగా తన సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :