“RRR” హీరోయిన్ మోస్ట్ అవైటెడ్ సినిమాకి డేట్ ఫిక్స్.!

“RRR” హీరోయిన్ మోస్ట్ అవైటెడ్ సినిమాకి డేట్ ఫిక్స్.!

Published on Jan 28, 2022 12:30 PM IST


పాన్ ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం “రౌద్రం రణం రుధిరం” రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆల్ మోస్ట్ ఇక ఏప్రిల్ నెలకే రిలీజ్ అవ్వడం జరిగేలా ఉంది. అయితే మరి ఈ భారీ సినిమాకి ఇది వరకు ఫిక్స్ అయ్యిన జనవరి డేట్ తో చాలానే మార్పులు జరిగిన సంగతి తెలిసిందే.

అప్పటికి రేస్ లో ఉన్న టాలీవుడ్ భారీ సినిమాలు సహా బాలీవుడ్ సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. మరి వాటిలో ఇదే “RRR” చిత్రంలో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ బాలీవుడ్ లో చేసిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “గంగూభాయి ఖతియావాది” కూడా ఒకటి. బాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడు నుంచా అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాని ఇప్పుడు మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ కి ఫిక్స్ చేశారు.

వచ్చే ఫిబ్రవరి 25 న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పుడు ప్రకటించారు. దీనితో ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా రిలీజ్ హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఇక ఈ భారీ సినిమాని అక్కడి స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించగా పెన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు